సిఎం కిరణ్‌ను మళ్లీ టార్గెట్ చేసిన జగన్ వర్గం నేత పెద్దిరెడ్డి

గార్గేయ జలాలు తన నియోజకవర్గానికి అక్రమంగా తరలిస్తున్న ముఖ్యమంత్రి చర్యలకు నిరసనగా తాను రెండు రోజుల పాటు 56 కిలోమీటర్ల మేర పుంగనూరు నుండి చేపడతానని చెప్పారు.ముఖ్యమంత్రిపై తనకు వ్యక్తిగత కక్ష్య లేదని అయితే తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా మాత్రమే ఈ పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. మంత్రిపదవులలాంటివి ఏమీ లేకుంటా నేరుగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన కిరణ్‌కు ప్రజా సమస్యలు తెలియవని అన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా గార్గేయ నీటిలో తమ ప్రాంతానికి న్యాయం చేయాలని కోరారు.
కాగా జిల్లా ఇంఛార్జ్ మంత్రి రఘువీరారెడ్డి మహాపాదయాత్ర విరమించుకోవాలని పెద్దిరెడ్డిని కోరారు. అందుకు పెద్దిరెడ్డి ససేమీరా అన్నట్టు తెలుస్తోంది. పాదయాత్ర విషటంలో అధిష్టానం తనపై చర్యలు తీసుకుంటుందని తాను భావించడం లేదన్నారు. తమ ప్రాంతానికి రావాల్సిన న్యాయమైన వాటా కోసం పోరాడుతున్నందున అధిష్టానం ఈ విషయాన్ని తప్పుగా భావించదన్నారు. గార్గేయ నదీ జలాల విషయంలో మంత్రి రఘువీరారెడ్డి న్యాయం చేస్తాడన్న నమ్మకం తనకు లేదన్నారు. అయితే తన బాధ్యతగా ప్రభుత్వ దృష్టికి మొదట తీసుకెళతానని చెప్పారు.












Click it and Unblock the Notifications