కాసేపట్లో ప్రత్యేక రైలులో ఢిల్లీ బయలుదేరనున్నవైయస్ జగన్

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడువైయస్ జగన్మోహన్‌రెడ్డి ఆదివారం మధ్యాహ్నం న్యూఢిల్లీ బయలు దేరనున్నారు. రాష్ట్రంలోని రైతుల సమస్యల పరిష్కారం కోసం ఆయన ఈనెల 11న ఢిల్లీలో దీక్షను చేపడుతున్నారు. దీక్ష కోసం ఆయన ఆదివారంఢిల్లీకి ప్రత్యేక రైలులో బయలు దేరుతారు. విశాఖ ఓదార్పులో ఉన్న జగన్ ఆదివారం ఉదయం విశాఖనుండి హైదరాబాదు చేరుకున్నారు. ఇంటి దగ్గరినుండి 12.50 గంటలకు రైల్వే స్టేషన్‌కు బయలు దేరి వెళతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక రైలులో ఆయన ఢిల్లీ బయలు దేరి వెళతారు.

జగన్ దీక్షలో పాల్గొనడానికి ఇప్పటికే కొందరు శాసనసభ్యులు ఢిల్లీకి బయలుదేరారు. జగన్ వెంట 1479 మంది కార్యకర్తలు, 175 మంది స్థానిక ప్రజా ప్రతినిధులు వెళ్లనున్నారు. కాగా ఢిల్లీ వెళ్లనున్న జగన్‌ను శాసనసభ్యులు మేకపాటి, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, అమరనాథ్‌రెడ్డి తదితరులు కలిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+