ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణ పార్లమెంటు సభ్యులు తేల్చుకుంటారా?

వైయస్ జగన్ వెంట వెళ్లిన ప్రజాప్రతినిధులకు లేని హైకమాండ్ తమకే ఉందా అని కూడా ప్రశ్నించారు. కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు రాయపాటి, కావూరి, లగడపాటి శ్రీకృష్ణ కమిటీ సభ్యులకు ముడుపులు ఇచ్చారని మధు యాష్కీ ఆరోపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పార్లమెంటు సభ్యులు ప్రణబ్‌ను కలుస్తున్నారు. ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందేనని, లేకుంటే తాము ప్రజల్లోకి వెళ్లలేమని వారంటున్నారు. వీరి వాదనలను పార్టీ అధిష్టానం సానుభూతితో వింటుందా అనేది అనుమానమే.












Click it and Unblock the Notifications