డిఎల్ రవీంద్రా రెడ్డి వర్సెస్ వైయస్ జగన్: మంత్రుల మండిపాటు

YS Jagan-DL Ravindra Reddy
హైదరాబాద్: తాజా వైరాన్ని తనకు, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు మధ్య సమరంగా మార్చేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి ప్రయత్నిస్తున్నారు. వైయస్ జగన్‌ పై ఆయన కొద్దిరోజులుగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఢిల్లీలో వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. వైయస్ జగన్‌కు సవాల్ విసిరారు. నిజానికి, రవీంద్రా రెడ్డి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి ఒకప్పుడు మంచి మిత్రుడు. అయితే, వైయస్సార్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రవీంద్రా రెడ్డిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. రెండు విడతలు కూడా రవీంద్రారెడ్డిని ఆయన మంత్రి పదవికి దూరంగానే ఉంచారు. ఈ స్థితిలో ఆయన వైయస్‌కు వ్యతిరేకంగా మారిపోయారు, ఇప్పుడు వైయస్ జగన్‌కు ప్రత్యర్థిగా మారారు.

కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చేరిన తర్వాత రవీంద్రా రెడ్డి వైయస్ జగన్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. చీమూ నెత్తురు ఉంటే వైయస్ జగన్ తన వర్గం శాసనసభ్యులతో రాజీనామాలు చేయించాలని ఆయన సవాల్ చేశారు. తన దయాదాక్షిణ్యాల మీద ప్రభుత్వం మనుగడ సాగిస్తోందని, తాను తలుచుకుంటే ప్రభుత్వం పడిపోతుందని వైయస్ జగన్ అనడంపై ఆయన ఆ సవాల్ విసిరారు. అయితే, రవీంద్రారెడ్డి మాటలు జగన్‌ను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని సహచర మంత్రులు అంటున్నట్లు సమాచారం. జగన్‌ను రెచ్చగొడితే శాసనసభ్యులతో రాజీనామాలు చేయిస్తే ప్రభుత్వం అస్థిరం పాలు కావడం తప్పదని, ఈ వాస్తవాన్ని గుర్తించి డిఎల్ రవీంద్రా రెడ్డి మాట్లాడాలని వారంటున్నారని సమాచారం. ఒక సందర్భంలో డిఎల్ రవీంద్రారెడ్డిపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయాలని అనుకున్నారని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+