వైయస్ జగన్ ను తిప్పికొట్టడానికి డి. శ్రీనివాస్ పరోక్ష సూచనలు

పార్టీని వదిలివెళ్లినవారి జాబితాను రూపొందించాలని ఆయన నాయకులను ఆదేశించారు. పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. రాష్ట్రస్థాయి వరకు అభివృద్ధి కమిటీలను వేయాలనే యోచనలో పిసిసి ఉన్నట్లు సమాచారం. ఈ అభివృద్ధి కమిటీల ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. రానున్న కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై, వైయస్ జగన్ వ్యవహారంపై, శ్రీకృష్ణ కమిటీ అనంతర పరిణామాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications