తెలంగాణ కోసం వరంగల్ లో ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
Districts
oi-Srinivas G
By Srinivas
వరంగల్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడదేమోననే అనుమానంతో వరంగల్ జిల్లా చీరాల మండలం వీరన్నపేటకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి మల్లికార్జున్ గౌడ్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందరూ కలిసి ఉద్యమించి తెలంగాణ సాధించుకోవాలని ఆయన తన సూసైడ్ లో పేర్కొన్నాడు. ప్రభుత్వం తెలంగాణను కమిటీల పేరుతో కాలాయాపన చేస్తుందన్నాడు. శ్రీకృష్ణ కమిటీ తర్వాత అయినా తెలంగాణలోని పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ వస్తుందని ఆశించానని అయితే కమిటీ నివేదిక కూడా తెలంగాణకు అనుకూలంగా లేకపోవడంపట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.