వైయస్ జగన్ వెంట వెళ్లడం తప్పు, చర్యలుంటాయి: కంతేటి సత్యనారాయణ

YS Jagan
హైదరాబాద్ : తమ పార్టీకి చెందినవారు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెంట వెళ్లడం తప్పు అని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) క్రమశిక్షణా సంఘం చైర్మన్ కంతేటి సత్యనారాయణ రాజు అన్నారు. వారిపై కచ్చితంగా చర్యలుంటాయని, వారిపై చర్యలు తీసుకునే విషయం పార్టీ అధిష్టానం పరిశీలనలో ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమైన అనంతరం ఆయన బుధవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. చర్యలు తీసుకోవడానికి కొంత సమయం మాత్రమే పడుతుందని ఆయన చెప్పారు. ఎంత సమయం అనే మీడియా ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వలేదు.

జల సమస్య వంటి భావోద్రేకమైన సమస్య వల్లనే తాము జగన్ దీక్షకు వెళ్లామని అంటున్నారని ఆయన అన్నారు. పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర విభజన ఉద్యమాల సందర్భంగా రాజీనామాలు చేశారని, ఇటువంటి ఆందోళనలు వచ్చినప్పుడు నాయకత్వాలు సహనం ప్రదర్శిస్తాయని, ఇటువంటి సమయాల్లో నాయకులపై చర్యలు తీసుకునే విషయంపై ఆలోచించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. పార్టీని విమర్శిస్తే కూడా అనర్హహత వేటు పడుతుందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+