హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్దెలచెర్వు సూరి హత్య కేసు: భాను కిరణ్ దుబాయ్ పారిపోయాడా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Bhanu Kiran
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసు నిందితుడు భాను కిరణ్ దుబాయ్ పారిపోయాడనే ప్రచారం జరుగుతోంది. అతనికి దుబాయ్‌లో అండర్ వరల్డ్ సంబంధాలున్నాయని చెబుతున్నారు. హత్య జరిగిన జరిగిన తర్వాత తన అనుచరుల సహాయంతో భాను గోరఖ్‌పూర్ వెళ్లాడని, అక్కడి నుంచి నేపాల్‌కు పారిపోయాడని, నేపాల్ నుంచి దుబాయ్ ‌లో కాలు పెట్టాడని వార్తలు వస్తున్నాయి. దుబాయ్ వెళ్తే భాను కిరణ్ ‌ను అరెస్టు చేయడం సాధ్యం కాదని అంటున్నారు. అరెస్టును తప్పించుకోవడానికే అతను ఆలా చేసి ఉంటాడని అంటున్నారు. అయితే, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి ప్రమేయం బయటపడుతుందనే ఉద్దేశంతో, దాన్ని కప్పిపుచ్చడానికి భాను కిరణ్ పరారీ కథలు అల్లుతున్నారని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు.

భాను కిరణ్ ‌తో సంబంధాలున్నాయని అనుమానిస్తున్న ప్రదీప్ రెడ్డిని, ధర్మవరం శాసనసభ్యుడు వెంకటకృష్ణా రెడ్డి సోదరుడిని పోలీసులు విచారించినట్లు సమాచారం. పారిశ్రామికవేత్త సుభాష్ చంద్రబోస్ ఆస్తి తగాదాలో భాను కిరణ్‌తో పాటు ప్రదీప్ రెడ్డి జోక్యం చేసుకున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో సూరి హత్య కేసులో అతని పాత్రపై కూడా ఆరోపణలు వచ్చాయి. నేరుగా ప్రదీప్ రెడ్డి మిత్రుడు, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డిపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రదీప్ రెడ్డి ఓ టీవీ చానెల్‌కు వివరణ కూడా ఇచ్చుకున్నాడు. విజయవాడ సంఘటనతో కార్తిక్ రెడ్డికి సంబంధం లేదని చెప్పాడు. భానుతో కూడా తాను వ్యవహారం నడపలేదని అతను చెప్పాడు.

సుభాష్ చంద్రబోస్ కుమారుడు కృష్ణప్రసాద్ తన వద్దకు వచ్చి తనతో కలిసి వ్యాపారం చేయాలని కోరాడని, అతని వ్యాపారం తనకు నచ్చిందని, దాంతో అతని కోరిక మేరకు వాటాలు తీసుకోపడానికి అంగీకరించానని, అందుకు తాను కొన్ని డబ్బులు కూడా ఇచ్చానని ప్రదీప్ రెడ్డి చెప్పుకున్నాడు. తనకు ఓ కంపెనీ ఉందని చెప్పి తన భాగస్వామ్యాన్ని కృష్ణప్రసాద్ కోరాడని ప్రదీప్ చెబుతున్నాడు. భాను కిరణ్ ఆచూకీని కనుక్కోవడంలో పోలీసులు ఇంత జాప్యం ఎందుకు చేస్తున్నారనేదే ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X