రాహుల్ గాంధీ ప్రకటనపై మండిపడుతున్న ఎన్ సిపి

ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తన నాయనమ్మ ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెసు ఒకే పార్టీ అధికారంలో ఉందని, దాంతో ధరలను ఇందిరా గాంధీ అదుపు చేయగలిగారని, ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం కావడంతో సాధ్యం కావడం లేదని ఆయన అన్నారు. రాహుల్ ప్రకటనపై ఎన్‌సిపి నేత తారిఖ్ అన్వర్ మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీ వాస్తవాలను అర్థం చేసుకోవాలని, ధరల పెరుగుదలను కట్టడి చేయడాన్ని ఉమ్మడి బాధ్యతగా స్వీకరించాల్సి ఉంటుందని, ఏ ఒక్క వ్యక్తికో సంబంధించిన విషయం కాదని ఆనయ అన్నారు.












Click it and Unblock the Notifications