తమిళనాడు రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ఆంధ్ర అయ్యప్ప భక్తుల మృతి
Districts
oi-Pratapreddy
By Pratap
చెన్నై: తమిళనాడులోని మధురై రోడ్డులో జరిగిన ఓ రోడ్డుప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన 5గురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. క్వాలిస్ ఆగి ఉన్న లారీని ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బేగంపేట్‌కు చెందిన కొందరు అయ్యప్పభక్తులు శబరిమలనుంచి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 5గురు మృతిచెందగా 4గురు గాయపడ్డారు.
మృతులను బాలరాజు, జాపాడు శ్రీనివాస్, సాయికూమార్ గా గుర్తించారు. మరో ఇద్దరిని కూడా పోలీసులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలోని బేగంపేటలో విషాద వాతావరణం నెలకొంది.