ముంబైలో మరో 'ఆదర్శ్‌' కుంభకోణం, చర్యకు ఆర్మీ హామీ

India Army
న్యూఢిల్లీ: ఆర్మీకి సంబంధం ఉన్న ఆదర్స్‌ భూముల కుంభకోణం విషయం ఇంకా పాతబడకముందే మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 2007 సంవత్సరంలో రక్షణశాఖ మాజీ సహాయమంత్రి రావ్‌ ఇందర్‌జీత్‌ సింగ్‌, అప్పటి ఆర్మీ చీఫ్‌ జనరల్‌ దీపక్‌ కపూర్‌ లు ముంబయిలోని ఖండివాలి-మలాద్‌ ప్రాంతంలో ఆర్మీ లీజులో ఉన్న ప్రాంతాన్ని ఓ ప్రైవేట్‌ బిల్డర్‌కు అమ్మటంలో కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆర్మీ విచారణకు ఆదేశించింది. సిబిఐ దర్యాప్తునకు ఆదేశించే అవకాశాలున్నట్లు ఆర్మీ చీఫ్ మాటలను బట్టి అర్థమవుతోంది.

సదరన్‌ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ప్రదీప్‌ఖన్నా, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌లు దీనిపై రక్షణశాఖకు నివేదిక అందజేశారు. అందులో వారు ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పరిశీలన జరుగుతోందని రక్షణమంత్రి ఏకే ఆంటోని తెలిపారు. అయితే ఈ లావాదేవీలతో తనకెలాంటి సంబంధం లేదని మహారాష్ట్ర ప్రభుత్వమే ఈ భూమిని అమ్మకం చేసిందని రావ్‌ ఇందర్‌జీత్‌సింగ్‌ తెలిపారు. తమకు నివేదిక అందిందని, దాన్ని పరిశీలిస్తున్నామని రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+