గవర్నర్ నరసింహన్‌తో చిరంజీవి రహస్య భేటీ, మద్దతుపై చర్చ

మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెంట ఎంత మంది వెళ్తారు, ప్రభుత్వానికి మద్దతిచ్చే ఇతర పార్టీలు ఏవి అనే విషయాలను నరసింహన్ కిరణ్ కుమార్ రెడ్డిని అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. ఈ తరుణంలో కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతిచ్చే విషయంపై చిరంజీవితో గవర్నర్ మాట్లాడినట్లు చెబుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు ఎంత మంది కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతిచ్చే నిర్ణయానికి కట్టుబడి ఉంటారనే విషయాన్ని కూడా నరసింహన్ చిరంజీవిని అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications