జగన్ పై కాలుదువ్వుతున్న డిఎల్: ఎమ్మెల్యేలతో సై అంటే సై

నేటి వరకు శాఖాపరమైన ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్న డిఎల్ నాదెండ్లను అపాయింట్‌మెంట్ కోరినట్టుగా తెలుస్తోంది. తాను రాజీనామాకు రెడీగా ఉండి జగన్ వర్గానికి ఇబ్బందుల్లో నెట్టడానికే అపాయింట్‌మెంట్ అడిగినట్టుగా సమాచారం. ఇప్పటికే కడప, పులివెందులలో జగన్, విజయమ్మ రాజీనామాలతో ఉపఎన్నికలకు వస్తున్నాయి. ఇప్పుడు తనతో పాటు జగన్ వర్గం కమలమ్మ, శ్రీకాంత్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి తదితరులు నలుగురు రాజీనామా చేస్తే మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు, 1 పార్లమెంటు నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరుగుతాయని అప్పుడు ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఆవేశంలో ఉన్న డిఎల్ రవీంద్రారెడ్డి జగన్ వర్గంతో తేల్చుకోవడానికి నిశ్చయించుకోవడంతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సముదాయిస్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో ఆవేశాలు ఉండకూడదని చెప్పినట్టుగా తెలుస్తోంది. కాగా డిఎల్ అపాయింట్‌మెంట్‌కు నాదెండ్ల స్పందించాల్సి ఉంది. నాదెండ్ల కనుగ అపాయింట్‌మెంట్ ఇస్తే డిఎల్, జగన్ వర్గాన్ని ఢీకొట్టేందుకు పూర్తిగా సన్నద్ధమయినట్టుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications