కెసిఆర్ కాంగ్రెసు ఏజెంట్, పోరాటం తెలంగాణ కోసం కాదు: దేవేందర్ గౌడ్

వారికి కావాల్సింది తెలంగాణ రాష్ట్రం కాదని అన్నారు. టిడిపిని దెబ్బతీయడం, తెలంగాణ సెంటిమెంటుతో నాలుగు సీట్లు ఎక్కువగా గెలుచుకోవడమే తెలంగాణ లక్ష్యమని అన్నారు. కెసిఆర్ కాంగ్రెసు ఏజెంట్‌గా మారారని ఆరోపించారు. శ్రీకృష్ణ నివేదిక అనంతరం తెలంగాణ రాకుంటే భూకంపం సృష్టిస్తానన్న కెసిఆర్ ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారని అన్నారు. తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది మేమే అంటున్న కాంగ్రెసు వారిని వదిలి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకోవడంలో అర్థం ఏముందని ప్రశ్నించారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని మేం మూడు రోజులు ప్రభుత్వంతో గట్టిగా మాట్లిడేతే కేసులు ఎత్తివేయకుండా కాంగ్రెసు పార్టీ వారు ఒక్కరోజు చేయగానే ఎత్తివేయడంలో అర్థం ఏమిటని ప్రశ్నించారు.
కెసిఆర్ ప్రజాసమస్యలపై ఏనాడైనా స్పందించారా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉందని చెప్పారు. తెలంగాణ కోసం కేసిఆర్ టిడిపిపై పడకుండా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాపై ఒత్తిడి తేవాలన్నారు. తమ నాయకుడు ఏం చేస్తున్నారో అసలు టిఆర్ఎస్ కార్యకర్తలకే తెలియదని ఎద్దేవా చేశారు. తెలంగాణ పేరుతో సీట్లు సంపాదించుకోవటం తప్ప తెలంగాణ కోసం కెసిఆర్ పోరు కాదన్నారు. కాంగ్రెసు పార్టీ అంతర్గత సమస్యలలో కూరుకు పోయి ప్రజా సమస్యలను పట్టించుకోవటం లేదన్నారు.












Click it and Unblock the Notifications