హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్‌పై అంజన్‌ మండిపాటు: ఆ రెండూ కావాలన్న సికింద్రాబాద్ ఎంపీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anjan kumar Yadav
హైదరాబాద్: సికిందరాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్‌కుమార్‌యాదవ్ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ఎంపీ కె చంద్రశేఖరరావుపై ఆదివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులతో మూడు రోజుల ములాఖత్‌లో భాగంగా ఆదివారం తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారిపై చిందులు వేశారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా వారు ఆయనను కోరారు. తాము ఏ పార్టీ తరఫున రాలేదని తెలంగాణ ఉద్యమం కోసం పార్టీలకతీతంగా వచ్చామని చెప్పారు.

ఈ సందర్భంగా ఎంపీ టిఆర్ఎస్‌పై, కెసిఆర్‌పై ధ్వజమెత్తారు. తనకు తెలంగాణ కావాలి, అలాగే మంత్రి పదవీ కావాలని చెప్పారు. తనను ఎంపీ పదవికి రాజీనామా చేయమని అడగడమేమిటని వారిని ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంటు పేరు చెప్పి కేసిఆర్ ఎంపీ కావచ్చు, మంత్రి పదవులు పొందవచ్చు. కానీ బలహీనవర్గాలకు చెందిన తాము మాత్రం రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. కెసిఆర్ తెలంగాణను సెంటిమెంటుకోసం ఉపయోగించుకున్నారన్నారు. తెలంగాణ పేరుతో కుటుంబ సభ్యులంతా పార్టీలో చేరిపోయారన్నారు. కెసిఆర్‌తో పాటు రాష్ట్రంలో నాయిని నర్సింహారెడ్డి, హరీష్‌రావు తదితరులు మంత్రి పదవులను పొందారన్నారు. అగ్రవర్ణాలకు చెందిన వారు ఉద్యమంలో బలహీన వర్గాలను బలి చేస్తున్నారని ఆరోపించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X