భాను హిరోయిన్ల కాల్షీట్లూ అమ్ముకున్నాడు, శింగనమల చుట్టూ ఉచ్చు

నిర్మాత రమేష్ సంపాదన నాలుగేళ్లలో నాలుగు రెట్లు పెరిగింది. దీని వెనుక ఆయనకు భానుతో ఉన్న సంబంధాలే కారణమా? అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. ఆదాయపు పన్నుశాఖ నుంచి ఆదాయ వివరాలు సేకరిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం 2002లో రమేష్ సమర్పించిన ఆదాయపు పన్ను ధ్రువపత్రంలో వ్యవసాయ ఆదాయం రూ. 1.5 లక్షలు, సొంత ఆదాయం రూ. 24 లక్షలుగా చూపించాడు. 2006 నాటికి మొత్తం సంపాదన రూ. 1.10 కోట్లకు పెరిగింది. ఇది అధికారికంగా చూపించిందేనని, వాస్తవంగా ఇంతకు పది రెట్లయినా ఉంటుందని పోలీసులే చెబుతున్నారు. అప్పు తీసుకోవడం, అడిగితే భానుతో బెదిరించడం వంటి చర్యలే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరోపక్క తన సొంత జిల్లా అనంతపురంలోనూ రమేష్‌పై పదుల సంఖ్యలో చెక్‌బౌన్స్ కేసులు ఉన్నాయని సీసీఎస్ పోలీసులు చెబుతున్నారు. అనంతపురం నుంచి ఈ వివరాలు తెప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications