సినిమా, రాజకీయాల్లో ఎన్టీఆర్‌లాంటి వ్యక్తి లేరు: చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: సినిమారంగంలోగానీ, రాజకీయరంగంలోగానీ దివంగత ఎన్టీఆర్‌లాంటి వ్యక్తి మరొకరు లేరని తెలుగుదేశం పార్టీ ఆధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం అన్నారు. ఎన్టీఆర్ 15వ వర్ధంతి సందర్భంగా చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్‌కుమార్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దేవేందర్‌గౌడ్, తలసాని శ్రీనివాసయాదవ్, విజయరామారావు, నన్నపనేని రాజకుమారి తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు.

భారతరత్నకు ఎన్టీఆర్ అన్ని విధాలా అర్హుడని అన్నారు. తెలుగుజాతికి ప్రపంచ ప్రఖ్యాతిని తీసుకు వచ్చిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికే ఆలస్యమైందన్నారు. ఇప్పటికైనా ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. విలువలతో కూడిన రాజకీయం ఎలా చేయాలో ఎన్టీఆర్ అందరికీ చూపించారన్నారు. తెలుగుదనాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి అన్నారు. రాజకీయాలు స్వార్థం కోసం కాదని ప్రజల కోసమని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్‌లాంటి వ్యక్తికి భారతరత్న ఇచ్చే వరకు పోరాడుతామని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరును మార్చి రాజీవ్ పేరు పెట్టారని టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని మారుస్తామన్నారు.

అనంతరం సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. కాగా అంతకుముంద చంద్రబాబు రసూల్‌పురాలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శాంతి కపోతాలు ఎగురవేశారు. ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన అమరజ్యోతి ర్యాలీని ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+