వైయస్ జగన్ వర్గంలోకి నెల్లూరు ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి?

పార్టీ కార్యకర్తల అభిప్రాయం ఎలా ఉంటే ఆలా నడుచుకుంటానని ఆయన చెప్పారు. ఆయన తన కార్యకర్తలతో సమావేశమయ్యారు. జగన్ పార్టీలోకి కాకాని మాత్రమే కాకుండా ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా వస్తారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కాకానితో పాటు సుమారు 24 మంది జెడ్పీటిసిలు కూడా జగన్ వర్గంలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టుగా సమాచారం.
కాంగ్రెస్ జెడ్పీటీసీలలో ఎక్కువమంది జగన్ వెంట వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మిగిలిన వారు కూడా త్వరలో జగన్ వెంట వచ్చే అవకాశముందని తెలుస్తోంది. 15 మంది ఎంపీటీసులు కూడా ప్రస్తుతం మద్దతు తెలుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరు జెడ్పీలు కూడా కాకాని వెంట రావడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications