చిరంజీవి ప్రభుత్వంలో చేరే ప్రతిపాదనపై ఎంపి సబ్బం హరి కొర్రీ

రాష్ట్రంలోని పరిస్థితిని చక్కదిద్దతే కాంగ్రెసు పార్టీలో కొనసాగడానికి తనకు అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితి ఏర్పడుతుందని తాను గతంలోనే చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో తాము కలిసిన నెల రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఆయన చెప్పారు. సబ్బం హరి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు మద్దతిస్తున్న విషయం తెలిసిందే. ఆయన ఇటీవల ఢిల్లీలో జరిగిన జగన్ జలదీక్షలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications