గవర్నర్ కు ముఖ్యమంత్రికి మధ్య ముదురుతున్న మాటల యుద్ధం

ఈ నేపథ్యంలో గవర్నర్ భరధ్వాజ్‌ను రీకాల్ చేయాలని రాష్ట్రపతి, ప్రధానిలను యాడ్యూరప్ప కోరనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు ఆయన ఓ లేఖను సమర్పించనున్నారు. అంతే కాకుండా జనవరి 24న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కూడా యాడ్యూరప్ప కలవనున్నారు. యాడ్యూరప్ప ఎదుర్కుంటున్న వివిధ కుంభకోణాలపై విచారణ జరిపించాలని ఆయనపై ఇద్దరు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను భరధ్వాజ్ అనుమతించడంపై యాడ్యూరప్ప మండిపడ్డారు. ఈ మేరకు ఆయన గవర్నర్ భరధ్వాజ్‌కు ఓ లేఖ రాశారు.
కాగా..ఈ లేఖపై స్పందించిన భరధ్వాజ్ మీడియాతో మాట్లాడుతూ..ఓ దొంగ తిరిగి పోలీసునే ప్రశ్నించింనట్లుగా... యాడ్యూరప్ప వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే.. భరధ్వాజ్ చేసిన వ్యాఖ్యలపై యాడ్యూరప్ప స్పందిస్తూ.. తన సర్కారును సంక్షోభంలో పడేయటానికి గవర్నర్ రాజకీయ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications