నాగం జనార్దన్ రెడ్డికి మూడినట్లే, మోత్కుపల్లి నర్సింహులు ఫైర్

హైదరాబాద్: పార్టీలో తెలంగాణ ప్రత్యేక శాఖ కోసం డిమాండ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డికి మూడినట్లే ఉంది. నాగం జనార్దన్ రెడ్డిపై తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలంగాణకు ప్రత్యేక శాఖ అవసరం లేదని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా చేయలేదని ఆయన చెప్పారు. పార్టీలో తెలంగాణ ఉద్యమం పేర ఆధిపత్య పోరు చేస్తున్నారని, తెలుగుదేశంలో కాంగ్రెసు సంస్కృతిని కొందరు పెంచి పోషిస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబును కొంత మంది సీనియర్ నాయకులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. నాగం జనార్దన్ రెడ్డి పేరు చెప్పకుండా మోత్కుపల్లి మాట్లాడినా ఆ మాటలన్నీ నాగం జనార్దన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినవేనని అర్థమవుతోంది.

అప్పుడే తెలంగాణ వచ్చేసినట్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవుదామని తాపత్రయపడుతున్నారని ఆయన అన్నారు. ఉద్యమం తెలంగాణ కోసమా, ముఖ్యమంత్రి పదవి కోసమా అని ఆయన అడిగారు. కొందరు తెలంగాణ నాయకులను పార్టీలో సమైక్యవాదులుగా చిత్రీకరించడం సరి కాదని ఆయన అన్నారు. పార్టీని దెబ్బ తీసేలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్సించారు. తెలంగాణ సాధన కోసం పోరాటం చేద్దామని, ఆధిపత్య పోరు వద్దని ఆయన అన్నారు. ఆధిపత్య వర్గాలు తమలాంటి బలహీన వర్గాలపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అధికారం కోసం ఉరుకులాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు. మోత్కుపల్లి నర్సింహులు విమర్శలతో తెలుగుదేశంలోని తెలంగాణ నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+