వైయస్ జగన్ వెంటే ఎల్లవేళలా నడుస్తా: సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ

Jayasudha
హైదరాబాద్: తాను ఎల్లవేళలా మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెంటే ఉంటానని సికింద్రాబాద్ కాంగ్రెసు శాసనసభ్యురాలు జయసుధ అన్నారు. తాను ఎప్పటికీ జగన్ వర్గం శాసనసభ్యురాలిగానే కొనసాగుతానని ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా వైయస్ జగన్ విశాఖపట్నంలో చేపట్టిన దీక్షకు తన మద్దతు ఉంటుందని ఆమె చెప్పారు. అనారోగ్యం కారణంగానే తాను వైయస్ జగన్ జనదీక్షకు వెళ్లలేదని ఆమె చెప్పారు.

జయసుధ ఇంతకు ముందు వైయస్ జగన్ విజయవాడలో చేపట్టిన లక్ష్యదీక్షలో, ఢిల్లీలో చేసిన జలదీక్షకు జయసుధ హాజరయ్యారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో జయసుధ రాజకీయాల్లోకి వచ్చి సికింద్రాబాదు శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+