కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెసు ఎమ్మెల్యే కుతూలమ్మ ఫైర్

Kuthuhalamma
చిత్తూరు: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెంట వెళ్లినవారు రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనడంపై చిత్తూరు జిల్లా శాసనసభ్యురాలు కుతూహలమ్మ తీవ్రంగా ధ్వజమెత్తారు. కిరణ్ కుమార్ రెడ్డి అలా అనడం అనైతికమని ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై జగన్ దీక్ష చేపట్టడం న్యాయమని, అందుకే శాససభ్యులు జగన్ వెంట వెళ్తున్నారని ఆమె అన్నారు. జగన్ పార్టీలో చేరే విషయంపై తాను ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని ఆమె చెప్పారు.

రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రచ్చరచ్చ కావటం ఖాయమని చిత్తూరు పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌కు ఉన్న ఇమేజ్‌ను దక్కించుకునేందుకే కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారన్నారు. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి, కిరణ్‌కుమార్‌రెడ్డి పోలికే లేదన్నారు. వైఎస్ ఎక్కడ...కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఎక్కడ అంటూ పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటున్నట్లేనని శివప్రసాద్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+