వైయస్ జగన్ కు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి చురకలు

రాష్ట్రంలో పాలన లేదని, కేంద్రంలో రాష్ట్రానికి తగిన ప్రాతినిధ్యం లేదని జగన్ చేసిన విమర్శలను పాత్రికేయులు ప్రస్తావించినప్పుడు ఆయన ఘాటుగా స్పందించారు. మే 24 నాటికి యూపీఏ-2 ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతుందని, ఆ సందర్భంగా భారీ విస్తరణ జరుగుతుందని, కచ్చితంగా రాష్ట్రానికి ప్రాతినిధ్యం పెరుగుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. "2004, 2009ల్లో రాష్ట్రానికి లభించని అవకాశం 2011లో దక్కనుంది. ప్రస్తుతం రాజా, శశి థరూర్, పృథ్వీరాజ్ చవాన్ రాజీనామాలతో ఏర్పడిన ఖాళీలను మాత్రమే భర్తీ చేశారు. దీన్ని విస్తరణగా భావించడానికి వీల్లేదు" అని చెప్పారు. రాష్ట్రంలో పాలన స్తంభించిపోయిందన్న జగన్ విమర్శలను లగడపాటి కొట్టిపారేశారు.












Click it and Unblock the Notifications