టార్గెట్ జగనే, పులివెందులలో రచ్చబండ: సిఎం కిరణ్‌కుమార్ వ్యూహం!

ఇంకా చెప్పాలంటే కడప జిల్లాలోని దివంగత వైయస్ నియోజకవర్గం పులివెందులనుండే దీనిని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. రచ్చబండను పులివెందులలో ఎక్కడినుండి ప్రారంభించాలని జిల్లా ఇంఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రులు డిఎల్ రవీంద్రారెడ్డి, వైయస్ వివేకానందరెడ్డి, అహ్మదుల్లాలతో ఆదివారం భేటీ అయ్యారు.
ఇందులో రచ్చబండను పులివెందులలో ఎక్కడినుండి ప్రారంభించాలనే విషయంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. తులసీరెడ్డి సైతం రచ్చబండను ఎక్కడనుండి ప్రారంభించాలనే విషయంపై చర్చించినట్లుగా చెప్పినట్లు సమాచారం. జగన్‌పై శనివారం ముఖ్యమంత్రి ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన నియోజకవర్గానికే వెళ్లి చేతల్లో ఆయనను సవాల్ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఈ భేటీలో రచ్చబండతో పాటు రాబోయే ఉప ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ, కడప పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఎవరిని నిలబెడదామనే విషయంపై కూడా చర్చ కొనసాగినట్లుగా తెలుస్తోంది. గెలుపు గుర్రాలనే, వైయస్ జగన్‌ను తట్టుకునే వారిని పోటీకి నిలబెట్టాలని యోచిస్తున్నారు.












Click it and Unblock the Notifications