హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రచ్చబండను అడ్డుకోండి: తెలంగాణ ప్రజలకు నాగం పిలుపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
హైదరాబాద్: తెలంగాణవాదులు అంతా సోమవారం నుండి ప్రభుత్వం నిర్వహించే రచ్చబండను అడ్డుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి ఆదివారం పిలుపునిచ్చారు. పెద్దమనుషుల ఒప్పందానికి అతీ గతీ లేదన్నారు. రచ్చబండ కేవలం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయాలనే లక్ష్యంతోనే పెట్టారన్నారు. ప్రజలు రచ్చబండను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రచ్చబండ రద్దు చేసినంత మాత్రన రేషన్ కార్డులు, పింఛన్లు ఆగవన్నారు. కానీ రచ్చబండ పేరుతో 1250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామనడం సరికాదన్నారు. అది ప్రజల సొమ్మును కాబట్టి ఇప్పుడు కాకపోయినా రేపైనా ఖర్చు పెట్టవలసిందేనన్నారు. రచ్చబండలో పాల్గొనే ప్రజా ప్రతినిధులను, మంత్రులను అడ్డుకోవాలని ఆయన ప్రజలను కోరారు. అలా అడ్డుకొని తెలంగాణ ఐక్యత చాటుదామన్నారు.

తెలంగాణపై జరిగిన అన్యాయాన్ని చర్చించడానికో, శ్రీకృష్ణ కమిటీపై చర్చకో రచ్చబండను ఉపయోగించి తెలంగాణ ప్రజల తెలంగాణ ఆకాంక్షను తెలుసుకోవాలన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఓ పనికి రాని రిపోర్టు అన్నారు. తెలంగాణకు మోసం చేస్తున్న మంత్రులను తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి రచ్చబండను ఏర్పాటు చేయండి సహకరిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రశాంతంగా ఉందని సంకేతాలు పంపే ఉద్దేశ్యంతో రచ్చబండను ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం సాధ్యం కాదన్నారు. ఇరు ప్రాంతాల ప్రజలు మానసికంగా విడిపోయి ఉన్నారన్నారు. మానసికంగా విడిపోయిన వారిని బలవంతంగా కలిపి ఉంచుదాం అనుకోవడం శోచనీయమన్నారు.

మాకు కావాల్సింది రాజ్యాంగ బద్ద రక్షణ కాదని ప్రత్యేక తెలంగాణ అని చెప్పారు. పెద్దమనుషుల ఒప్పందం, ఫజల్ అలీ కమిషన్, 610 జీవోలు అన్నింటినీ అణగదొక్కి మళ్లీ రాజ్యాంగబద్ద రక్షణ అనడం సరికాదన్నారు. సాధ్యం కాని విషయాన్ని ప్రజల ముందు పెట్టి అయోమయానికి గురు చేస్తున్నారన్నారు. విద్యార్థులపై కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరారు. సోమవారం ప్రారంభించబోయే రచ్చబండను తప్పకుండా అందరూ అడ్డుకోవాలన్నారు.సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి తెలంగాణవాదులను కొట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. రచ్చబండను రచ్చరచ్చ చేయాల్సిందేనన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X