'సత్యనారాయణ గారూ సిద్ధాంతంలో కలుద్దాం'.. అభిమానికి సీఎం చంద్రబాబు ట్వీట్..
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు కోట్లాదిమంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంక గ్రామానికి చెందిన సానబోయిన సత్యనారాయణకు సీఎం చంద్రబాబు అంటే ఎంతో అభిమానం.. ఒక్కసారైనా ఆయనను కలవాలని అనుకున్నారు. ఈ మేరకు తాను చంద్రబాబును కలవాలనే కోరికను వ్యక్త పరిచిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఆ వీడియోలో చంద్రబాబును ఎప్పుడైనా చూశావా..? అని ఓ యువకుడు అడగ్గా అందుకు సత్యనారాయణ హైదరాబాద్ వెళితే కనిపస్తారని చెప్పుకొచ్చారు. మరి చంద్రబాబును చూస్తావా..? అని అడగ్గా.. చూస్తానని సత్యానారయణ సమాధానమిచ్చారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని సిద్దాంతం వస్తున్నారని చెప్పగా.. సత్యనారాయణ ఎంతో సంతోషంతో తాను చూసేందుకు వెళ్తానని చెప్పుకొచ్చారు.

చంద్రబాబు తమ ప్రాంతానికి వస్తున్నారని ఆయనను ఖచ్చితంగా చూసి తీరాలని అన్నారు. ఆయన చల్లగా ఉండాలని సత్యనారాయణ చెప్పడం ఆ వీడియోలో కనిపించింది. అయితే ఈ వీడియో వైరల్ గా మారి చివరకు సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. దాంతో ఆయనే స్వయంగా స్పందించారు. "సత్యనారాయణ గారు రేపు సిద్దాంతంలో కలుద్దాం" అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు ట్వీట్ వైరల్ గా మారింది.
సత్యనారాయణ గారు... మనం రేపు సిద్దాంతంలో కలుద్దాం! https://t.co/FVSDN91znK
— N Chandrababu Naidu (@ncbn) June 7, 2026
ఇక సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం రోజున పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. తొలుత జూన్ 9వ తేదీన చంద్రబాబు నాయుడు పర్యటన ఉంటుందని చెప్పినప్పటికీ.. ఆ తర్వాత అందులో మార్పులు చేసి జూన్ 8వ తేదీన ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం జిల్లాలోని సిద్ధాంతంలో జరిగే 'మీ భూమి- మీ హక్కు' కార్యక్రమానికి హాజరుకానున్నారు.












Click it and Unblock the Notifications