వైయస్ కంటే సోనియా, రాహుల్ గొప్పవారు కాదు: అంబటి రాంబాబు

సోనియాగాంధీ కన్నెర్ర చేస్తే ముఖ్యమంత్రి కిరణ్ పీఠం కదిలి పోతుందని అన్నారు. ముఖ్యమంత్రికి ఆ సీటుపై కూర్చునే ఆర్హత ఏమాత్రం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆ పార్టీ సీనియర్ నేత రేవంత్‌రెడ్డి బఫూన్లు అని విమర్శించారు. పార్టీకి చేసిన వారికే పదవులు అంటూ ముఖ్యమంత్రి అంటున్నారని, అయితే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రధాని కాకముందు పార్టీకి ఏమేరకు సేవలు చేశారని ప్రధానిని చేశారని ప్రశ్నించారు. ఎప్పుడుపడితే అప్పుడు జగన్ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామా చేయరని సమయం వచ్చినప్పుడు వారే రాజీనామా చేస్తారని అన్నారు. తెలుగులో సరిగా ప్రమాణస్వీకారం చేయలేని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగువారికి ఏవిధమైన సేవ చేస్తారని అంబటి ప్రశ్నించారు.
అవిశ్వాస తీర్మానం పెట్టి మీ బలం నిరూపించుకోవాలని సిఎంకు జగన్ వర్గం మరోనేత గోనే ప్రకాశ్‌రావు ప్రశ్నించారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ పార్టీని విడగొట్టినప్పుడు ఆమె వెంట వచ్చిన వారికంటే ఇప్పుడు జగన్ వెంటే ఎక్కవ ప్రజలు వస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలోని నేతలకు జగన్‌నుగానీ, వైయస్‌నుగానీ విమర్శించే హక్కు లేదన్నారు. పార్టీని ఇందిరాగాంధీ చీల్చిందన్నారు. ఇందిర చీల్చిన పార్టీ కాబట్టి పార్టీకి ఇప్పుడు ముప్పయ్యేళ్లేనని, 125 సంవత్సరాలు కాదని అన్నారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications