గన్నవరంలో వింత దొంగతనం: చోరీకి గురైన బస్సు పట్టివేత

బస్సును ఓ క్లీనర్ దొంగిలించినట్లుగా తెలుస్తోంది. బస్సును అమ్ముకోవడానికే తీసుకు వెళ్లినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. గన్నవరం డిపోనుండి బస్సును దొంగిలించిన అతను తణుకు చెక్ పోస్టు మీదుగా తూర్పు గోదావరి వెళ్లినట్లుగా తెలుస్తోంది. కాగా బస్సులను ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నామని డిపో మేనేజరు చెబుతున్నారు. అయితే బస్సు డిపోనుండి బయటకు వెళుతున్నప్పుడు గుర్తించక పోవటం గమనార్హం. కాగా ఇంతకుముందు కూడా ఒకటిరెండు బస్సు దొంగతనాలు చోటు చేసుకోవడం విశేషం.












Click it and Unblock the Notifications