జైభోలో తెలంగాణను అడ్డుకోవద్దని సెన్సారుబోర్డు వద్ద లాయర్ల ఆందోళన

జైభోలో తెలంగాణ చిత్రాన్ని ఉద్దేశ్య పూర్వకంగానే సీమాంధ్ర పాలకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కుటుంబ సమేతంగా చూడలేని అశ్లీలత, అసభ్యత కలిగిన చిత్రాలకు, కత్తులతో పొడుచుకోవడం, బాంబులతో దాడులు, నరకడాలు వంటి సన్నివేశాలు ఉన్నా ఎన్నో చిత్రాల విడుదలకు నో చెప్పని సెన్సారు బోర్డు తెలంగాణ చారిత్రక కథను, వ్యథలను తెరరూపానికి తీసుకు వస్తే అడ్డుకోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. రాజకీయ నేతలు చంపించిన ఘటనలు, ఐఎస్ఐ వంటి పలు చిత్రాలను కూడా సెన్సారు అడ్డుకోలేదన్నారు. కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న లాయర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications