అవి పద్మ అవార్డులా.. లేక ప్రభుత్వ అవార్డులా..?

ఇదే అవకాశాన్ని అందిపుచ్చుకున్న కాంగ్రెస్ కూడా తమకు అనుకూలంగా వ్యవహరించిన వారికే పద్మ అవార్డులను ప్రకటించిందని, భవిష్యత్తులో ఎన్నికల నిధులకు లేదా ఎన్నికల ప్రచారానికి అస్త్రంగా ఈ అవార్డులను వాడుకుందనేది పలువురి వాదన. మొత్తం పద్మ అవార్డులలో 50 శాతం అవార్డులు కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఢిల్లీ (22 అవార్డులు), మహారాష్ట్ర (18 అవార్డులు), ఆంధ్రప్రదేశ్ (12 అవార్డులు), తమిళనాడు (12 అవార్డులు) వంటి రాష్ట్రాలకే దక్కడం గమనార్హం. మొత్తం 126 అవార్డులలో 63 అవార్డులు ఈ నాలుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి, మిగిలిన అవార్డులను దేశంలోని 26 రాష్ట్రాలు పంచుకున్నాయి. అంటే, ఈ నాలుగు రాష్ట్రాలతో పోలిస్తే.. దేశంలోని మిగిలిన రాష్ట్రాలలో వారికన్నా ప్రతిభ కలిగిన వారు లేరా..? అనేది విమర్శకుల ప్రశ్న.
వాస్తవానికి తమిళనాడులో కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా డిఎంకేతో తమకున్న సంబంధాలు తెగిపోకుండా ఉండేందుకు ఈ అవార్డులు ప్రకటించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏదైతేనేం ఈసారి ప్రకటించిన పద్మ అవార్డులలో పారదర్శకత లోపించిందని గట్టిగా వాదించేవాళ్లు లేకపోలేదు. అందువల్లనే ప్రజల్లో ఈ అవార్డులపై ఆసక్తి తగ్గిపోయింది. ఒకప్పట్లో ఇటువంటి అవార్డుల పొందిన సదరు వ్యక్తులను చాలా గొప్పవాళ్లుగా భావించేవాళ్లు. కానీ ఇప్పుడు వీటికి రాజకీయ రంగు పులుమడంతో ప్రజలు కూడా ఈ అవార్డులపై పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లు కనబడటం లేదని విమర్శకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications