హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌తో వెళ్లినా ఏమనరు, తెలంగాణ వారికే అధిష్టానమా: కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వెళుతున్న శాసనసభ్యులను కేంద్రం ఏమీ అనది కానీ తెలంగాణకు చెందిన కాంగ్రెసు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటుందా అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు శుక్రవారం ప్రశ్నించారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలకు లేని హైకమాండ్ తెలంగాణ కాంగ్రెసు‌కు ఎందుకు అన్నారు. జగన్ 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌కు సవాలు చేశారన్నారు. తెలంగాణ కోసం గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల చేస్తున్న సామూహిక దీక్షలలో కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ సాధన కోసమే తాను ఉద్యమం చేపట్టానన్నారు. సీమాంధ్రులు తెలంగాణవారి ఉద్యోగాలను తన్నుకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2001లో రైతుల గొంతును చంద్రబాబే కోశారన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

మా ఉద్యోగాలు మాకు దక్కాలంటే సీమాంధ్ర నేతలను బాగో అనాల్సిందేనన్నారు. అణిచివేత, దౌర్జన్యం ఉంటే తిరుగుబాటు తప్పకుండా వస్తుందన్నారు. తెలంగాణను ఏ శక్తి ఆపలేదన్నారు. ఏ పని చేసినా నమ్మకంతో చేయాలన్నారు. మన ప్రాజెక్టులకు నీళ్లులేక వెలవెల పోతున్నాయన్నారు. సీమాంధ్రలో మాత్రం భారీగా నీళ్లు ఉంటాయన్నారు. పదేళ్ల క్రితం మనల్ని సీమాంధ్ర నేతలు మనుషులుగా చూడలేదన్నారు. ఇప్పటిలా స్వేచ్ఛగా సమావేశాలు కూడా పెట్టుకోనివ్వలేదన్నారు. పదేళ్లదాకా పోరాడుతాను అని అంటే తెలంగాణ వచ్చేదాకా పోరాడుతాననే తన ఉద్దేశ్యం అన్నారు. అయితే సీమాంధ్ర మీడియా మాత్రం దానికి వక్రభాష్యం చెబుతుందన్నారు. ఆంధ్రా మీడియా కిరికి మీడియా అన్నారు. అసలు వ్యాఖ్యలు వదిలి కొసరు పట్టుకుంటుందన్నారు.

ఉద్యమం వ్యూహాత్మంగా ముందుకు వెళుతుందన్నారు. కెసిఆర్ మాట్లాడినా కష్టమే, మాట్లాడకున్నా కష్టమే అన్నారు. డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ ప్రకటన చేసినప్పుడు సీమాంధ్రులు అంతా ఒక్కటై తెలంగాణను అడ్డుకున్నారన్నారు. మనమందరం ఒక్కటై తెలంగాణ సాధించుకోవాలన్నారు. పాలనను స్తంభించడానికి వెనకాడవద్దన్నారు. నాలుగు కోట్ల ప్రజలు ఒక్కటై పోరాడుతుంటే కేంద్రం పట్టించుకోదా అని ప్రశ్నించారు. నేను నిరాహార దీక్ష చేసినప్పుడు విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు అందరూ మద్దతు తెలిపారన్నారు. తెలంగాణ అడ్డుకోవడానికి చిరంజీవితో సహా అందరూ సీమాంధ్రులు ఏకమవుతున్నారన్నారు. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెసు ఎంపీలు, ఎమ్మెల్యేలు కలవడం లేదన్నారు.

రాజీనామాలకు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. రాజీనామా చేస్తే ప్రజలు లక్షల ఓట్లతో గెలిపిస్తారన్నారు. డిసెంబర్ 31 తర్వాత తెలంగాణలో ఏదో జరుగుతుందని కేంద్రం బెటాలియన్లను దించిందిని అయితే తెలంగాణవాదులు శాంతియుతుంగా నిరసనలు తెలపడంతో లాఠీని గోడకు కొట్టిందన్నారు. కలిసి ఉంటే కలదు సుఖం అని అంటారని, అయితే సమైక్యాంధ్రలో మాత్రం తెలంగాణకు దుఖం, సీమాంధ్రులకు సుఖం అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X