జగన్ ప్రమేయం ఉందని తెలుస్తోంది: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పార్థసారథి రెడ్డి హత్యకు పెట్టిన సూట్‌కేసు బాంబు కేసులో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రమేయం ఉందని మంగలి కృష్ణ వాంగ్మూలం తెలియజేస్తోందని, అయినా జగన్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. దేనికైనా పాపం పండాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. నిజాలు చెప్పడానికి మీడియా ముందుకు రావడం లేదని, నిజాలు చెప్పడానికి మీడియా వాళ్లు భయపడుతున్నారో, లాలూచీ పడుతున్నారో తెలియడం లేదని ఆయన అన్నారు. పరిటాల రవి హత్య కేసులో తాను వైయస్ జగన్‌ను కాపాడడానికి రెండు నెలలు కష్టపడ్డానని ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు.

నేరస్థులను సమర్థించడం కూడా నేరమేనని, పరిటాల రవి హత్య కేసులో జగన్‌ను కాపాడానని చెప్పిన మాటకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని ఆయన అన్నారు. స్పష్టమైన ఆధారాలున్న పరిటాల రవి హత్య కేసునే పరిష్కరించడం లేదని ఆయన విమర్శించారు. తమకే న్యాయం జరగకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన అడిగారు. సూట్‌కేసు బాంబు కేసుకు కొనసాగింపే పరిటాల రవి హత్య అని ఆయన అన్నారు. సర్వీస్ బుల్లెట్ ఉన్నట్లు పరిటాల రవి మృతదేహంపై జరిగిన రీపోస్టుమార్టంలో తేలిందని ఆయన చెప్పారు.

నల్లధనాన్ని వెలికి తీయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారున. నల్లధనం కలిగి ఉన్నవారి పేర్లు ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు. దీనిపై సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసిందని ఆయన గుర్తు చేశారు. బ్లాక్ మనీని స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+