వైయస్ జగన్‌పై మరోసారి రాష్ట్ర మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ఫైర్

పార్టీని, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శిస్తున్నవారిని మంత్రులు ఎదుర్కోవడం లేదనే విషయాన్ని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ దృష్టికి తీసుకుని పోతానని ఆయన చెప్పారు. పరిటాల రవి హత్య కేసును సిబిఐ పునర్విచారణ జరిపించాలని తాను కోరుతానని, ఈ విషయంలో వస్తున్న వార్తల నిగ్గు తేల్చాలని తాను మంత్రివర్గంలో కోరుతానని ఆయన చెప్పారు. ప్రజాప్రతినిధులను కొనేవారిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై రోజూ మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. ఎన్నికలు వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు లాభపడుతారని, ప్రజలకు లాభం జరగదని ఆయన అన్నారు. ఎన్నికలు వస్తే కెసిఆర్ సీట్లు పెరుగుతాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications