వైయస్ జగన్, వైయస్సార్ కలిసి కోట్లకు కోట్లు దోచుకున్నారు: కాకా

"మీ అయ్య చేసిన పనుల మీద ప్రజల ముందుకు రా తెలుస్తుంది. ప్రజల డబ్బు కోట్లకు కోట్లే.. ఏంటిదీ? జగన్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేలు హైకోర్టు నోటీసులను చూసి, వాస్తవాలు తెలుసుకుని ఆశ్చర్య పోతున్నారు. అబ్బా జగన్ వెంట ఇంకేం పోతామయ్యా. వాడే జైలుకు పోయేటట్టుగా ఉంది అని భయపడుతున్నారు. ఇవి నేను మాట్లాడే మాటలు కాదు. ప్రజలు అనుకుంటున్నారు" అని వెంకటస్వామి (కాకా) అన్నారు. "ఇవన్నీ చూసి జగన్ వెంట ఎవరు వెళతారు? రెండు మూడు రోజులు ఆగి చూడండి. జగన్ వెంట ఎంతమంది ఎమ్మెల్యేలుంటారో తేలుతుంది. అక్రమాలపై హైకోర్టు జోక్యంతో ఎమ్మెల్యేలు భయపడుతున్నారు" అని ఆయన అన్నారు. "తెలంగాణ తెస్తానంటూ ప్రజలను కేసీఆర్ మోసం చేశాడు. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో ఎలాంటి ఫలితం లేదు. అందులో ఏ విషయమూ విస్పష్టంగా చెప్పలేదు" అని విమర్సించారు.












Click it and Unblock the Notifications