వైయస్ జగన్ భయపడుతున్నారు: రాయపాటి సాంబశివరావు

కెసిఆర్ ప్రకటనపై స్పందించే స్థితిలో తాను లేనని ఆయన అన్నారు. కెసిఆర్ నోటిని అదుపులో పెట్టుకోవాలని ఆయన సూచించారు. అన్ని ప్రాంతాలవారు ఒకే తెలుగు జాతివారని, తోటి తెలుగువారిపై కెసిఆర్ నోరు పారేసుకోవడం మంచిది కాదని ఆయన అన్నారు. కెసిఆర్ నోటి దురుసుతనాన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోరని ఆయన అన్నారు. విద్యార్థులను కెసిఆర్ రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం విద్యార్థుల చేతుల్లో లేదని, కొన్ని శక్తుల చేతుల్లోకి వెళ్లిందని ఆయన అన్నారు.
తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాలు రాకపోవడానికి తెలంగాణ నాయకులే కారణమని ఆయన విమర్శించారు. తెలంగాణ విద్యార్థులు ఉద్యమాల వల్ల ఓ విద్యాసంవత్సరాన్ని నష్టపోతారని, అది మంచిది కాదని ఆయన అన్నారు. రాజకీయ ఉద్యమాల వల్ల విద్యార్థులు నష్టపోయే స్థితి ఉందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయనేది భ్రమ మాత్రమేనని ఆయన అన్నారు. ట్రైవ్యాలీ విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా చూడాలని తాను కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications