జగన్‌కు వస్తున్న జనాలను చూసే అలా అంటుండవచ్చు: రోశయ్య

Rosaiah
గుంటూరు: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ సభలకు వస్తున్న జనాలను చూసే కాంగ్రెసుకు పుట్టగతులుండవని అంటుండవచ్చునని మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. కాంగ్రెసుకు 125 ఏళ్ల చరిత్ర ఉందని, ఎన్ని ఒడిదొడుకులను తట్టుకుని నిలబడిందని ఆయన అన్నారు. తనకు గవర్నర్ పదవి ఇస్తారనే వార్తలు మీడియా ఊహాగానాలేనని ఆయన అన్నారు. చిట్టచివరి వరకు తాను నిబద్ధత గల కాంగ్రెసు పార్టీ కార్యకర్తగానే ఉంటానని ఆయన అన్నారు.

తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులకు స్వేచ్ఛనిచ్చినట్లు ఆయన తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన వరదలు తనకు ఎక్కువగా బాధ కలిగించాయని ఆయన చెప్పారు. 1953కు ముందు గుంటూరులో హైకోర్టు బెంచ్ ఉండేదని, అప్పుడు దాన్ని తరలించినప్పుడు ఇక్కడి న్యాయవాదులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన ఉద్యమం సాగుతున్నందు వల్లనే హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య వివాదం వల్లనే మంగళగిరిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుపై నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+