బూతు పురాణం మానుకో: కెసిఆర్‌కు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సలహా

Somireddy Chandramohan Reddy
హైదరాబాద్: సీమాంధ్ర నాయకులపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యలను సీమాంధ్రకు చెందిన తెలుగుదేశం నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో తిప్పికొట్టారు. కెసిఆర్ బూతు పురాణం మానుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. కెసిఆర్‌కు ఉత్తమ బ్లాక్ మెయిలర్ అవార్డు వస్తుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కెసిఆర్ కుమారుడు ఆంధ్రవాళ్లతో వ్యాపారాలు చేస్తారని, కెసిఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. తన కుటుంబం ఆర్థికంగా బలపడడమే కెసిఆర్‌కు కావాలని ఆయన అన్నారు. కెసిఆర్ సంస్కారవంతమైన భాష నేర్చుకోవాలని ఆయన సూచించారు. కెసిఆర్ భాషను బజారువారు కూడా మాట్లాడరని ఆయన అన్నారు. ఆ భాషను వింటే కెసిఆర్ తాతముత్తాతలు కూడా సిగ్గుపడతారని ఆయన వ్యాఖ్యానించారు.

కెసిఆర్ రాజకీయాల్లో చాలా కాలం ఉన్నారని, చాలా పదవులు అనుభవించారని, ప్రభుత్వం నుంచి ఏం సంపాదించుకున్నారో జగన్ నుంచి ఏం పొందారో కెసిఆర్ చెప్పాలని ఆయన అన్నారు. ఆంధ్రవాళ్లను ఆడిపోసుకుంటూ నోటి దురదను తీర్చుకోవద్దని ఆయన కెసిఆర్‌కు సూచించారు. కెసిఆర్ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు. కెసిఆర్‌ను ఉస్మానియా విద్యార్థులు ఛీకొట్టారని, తెలంగాణవాళ్లే కెసిఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారని ఆయన గుర్తు చేశారు. అయినా కెసిఆర్‌లో మార్పు రాలేదని, కెసిఆర్‌కు సిగ్గు రాలేదని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు ప్రభుత్వంతో తేల్చుకోవాలని, లేదంటే ఇంట్లో కూర్చోవాలని, సీమాంధ్రవారిని తిట్టడం సరైంది కాదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+