సూరి హత్య కేసు: మీడియా ముందుకు నలుగురు నిందితులు

భాను కిరణ్ సూరిని హత్య చేసి పక్కనే నిలిపి ఉంచిన బైక్‌పై హరిబాబు, సుబ్బయ్యలతో కలిసి నగర శివారులోకి పారిపోయాడని, ఆ తర్వాత మన్మోహన్‌తో కలిసి షోలాపూర్ వైపు పారిపోయాడని ఆయన చెప్పారు. ఆ తర్వాత లోకనాథ్ అనే వ్యక్తితో కలిసి భాను పారిపోయాడని ఆయన చెప్పారు. షోలాపూర్, గుర్గావ్ తదితర ప్రాంతాల్లో తిరుగుతూ వచ్చారని ఆయన అన్నారు. సూరి హత్య కేసులో 30 మందిని విచారించామని, కీలకమైన సాక్ష్యాధారాలు సేకరించామని ఆయన చెప్పారు. భాను, తదితరుల పేర్ల మీద 100కు పైగా ఆస్తులున్నాయని, భాను పేరు మీద 9 ఆస్తులున్నాయని ఆయన అన్నారు. వాటి నిగ్గు తేల్చడం తమ పని కాదని, వాటి నిగ్గు తేల్చడానికి సంబంధిత శాఖలకు, సంస్థలకు అప్పగించామని ఆయన చెప్పారు. సూరి హత్య కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. హత్య చేసి భాను వస్తున్నట్లు తనకు తెలియదని, బస్సు దొరకడం లేదని, అందువల్ల వారి కోరికతో కారులో షోలాపూర్ వరకు డ్రాప్ చేసి వచ్చానని లోకనాథ్ అనే వ్యక్తి తనంత తానుగా వచ్చి తమకు చెప్పాడని, అందువల్ల అతన్ని నిందితుడిగా చేర్చలేదని ఆయన అన్నారు.
భానుపై మూడు కేసులు నమోదయ్యాయని, అవి బెదిరింపులకు సంబంధించి కేసులేనని ఆయన అన్నారు. ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తే సాక్ష్యాధారాలు చూసి చర్య తీసుకుంటామని ఆయన చెప్పారు. సూరి హత్య కేసులో రాజకీయ ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న వార్తలను చూస్తున్నానని, తనకు కేసు దర్యాప్తు ముఖ్యమని ఆయన అన్నారు. హత్యకు సహాయం కోసం పెట్టుకున్న వ్యక్తుల్లో ఆవుల వెంకటరమణ ఒక్కడని ఆయన చెప్పారు. సూరి డ్రైవర్ మధుమోహన్ రెడ్డి్ చెబుతున్న ప్రకారం అతనికి ప్రమేయం ఉన్నట్లు అనుకోవడం లేదని ఖాన్ చెప్పారు.












Click it and Unblock the Notifications