కెసిఆర్ రాక్షసుడు, పిల్లలను పీక్కు తింటున్నారు: టిజి వెంకటేష్

TG Venkatesh
హైదరాబాద్: సీమాంధ్ర నాయకులు రాక్షుసులని, ఉమ్మేసిన తుడుచుకుని పోతారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యపై సీమాంధ్ర నాయకులు తీవ్రంగా ప్రతిస్పందించారు. తెరాస నాయకులు కెసిఆర్, విజయశాంతి కోస్తాంధ్ర రక్తంతో పుట్టి రాక్షసులుగా మారి తెలంగాణ పిల్లల రక్తం పీల్చుకుని తాగుతున్నారని మంత్రి టిజి వెంకటేష్ వ్యాఖ్యానించారు. కెసిఆర్ పనికి మాలిన మాటలు మాట్లాడడం సరి కాదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆంధ్రవాళ్లు రాక్షసులుగా పుట్టి పీక్కుతింటారట, రాముడు కెసిఆర్‌కు చెప్పాడట అని ఆయన అన్నారు. కెసిఆర్, విజయశాంతి పిల్లలను చంపి పీక్కు తింటున్నారని ఆయన అన్నారు.

కెసిఆర్‌పై తెలంగాణవాళ్లే కేకరించి ఉమ్మేశారని కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి అన్నారు. కెసిఆర్ పార్టీ 40 సీట్ల నుంచి 21 సీట్లకు, ఆ తర్వాత 11 సీట్లకు తగ్గిందని ఆయన అన్నారు. బూట్లు నాకే అలవాటు తమకు లేదని, నాకించుకునే అలవాటు కూడా లేదని, అయితే కెసిఆరే కాంగ్రెసువారి బూట్లు నాకారని, బూట్లూ ఎలా నాకాలో కెసిఆర్‌ను చూస్తే తెలుస్తుందని ఆయన అన్నారు. కెసిఆర్‌కు మానవీయత ఏ కోశాన కూడా లేదని ఆయన అన్నారు. కెసిఆర్ క్షుద్రవ్యక్తి అని, రాక్షసాంశతో పుట్టాడని, భాష అంతకన్నా బాగుంటుందని అనుకోలేమని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+