వైయస్ జగన్, మంగలి కృష్ణలను అరెస్టు చేయాలి: దేవినేని ఉమ

మద్దెలచెర్వు సూరి వైయస్ జగన్ పెట్టే కొత్త పార్టీకి సహకరించకపోవడం, కాంగ్రెసు పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నాడని, ఈ స్థితిలో సూరి హత్య జరిగిందని ఆయన అన్నారు. పరిటాల రవి హత్య కేసులో సాక్ష్యాలను మట్టుబెడుతున్నారని ఆయన ఆరోపించారు. పరిటాల రవి హత్య కేసులో హంతకులకు శిక్షణ ఇచ్చిన రిటైర్డ్ కానిస్టేబుళ్లు ఎవరు, వారికి సహకరించిన పోలీసులు ఎవరు, హంతకులకు ఎవరు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అందించారు అనే విషయాలు బయటపడాలని ఆయన అన్నారు. పరిటాల రవి హత్య కేసుపై సిబిఐ చేత తిరిగి నిష్పాక్షికంగా దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications