వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేల్లో అనర్హత వేటు భయం

అనర్హత వేటు భయం పెట్టడంతో పాటు కిరణ్ కుమార్ రెడ్డి శాసనసభ్యులను బుజ్జగించే పనిని కూడా నిరంతరం కొనసాగిస్తున్నారు. ఈ రకంగా వైయస్ జగన్‌పై కిరణ్ కుమార్ రెడ్డి కొంత మేరకు పైచేయి సాధించినట్లు భావిస్తున్నారు. జగన్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్న కొర్ల భారతి, కుంజా సత్యవతి, రేగా కాంతారావు వంటి శాసనసభ్యులు తిరిగి వెనక్కి రావడానికి అదే కారణమని చెబుతున్నారు. మరింత మంది శాసనసభ్యులు కూడా జగన్ వైపు నుంచి తిరిగి కాంగ్రెసు వైపు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. అనర్హత వేటు నుంచి బయటపడాలనేదే వారి ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అనర్హత వేటు పడితే జగన్ పెట్టబోయే పార్టీ తరఫున పోటీ చేసి తిరిగి గెలిచే అవకాశాలపై సందేహాలతో కూడా ఇప్పుడే పదవులను వదులుకోవడానికి వారు సిద్ధంగా లేరని అంటున్నారు.












Click it and Unblock the Notifications