హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజకీయాల్లోకి టిడిపి నేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Nara Lokesh
హైదరాబాద్: తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు తనయుడు లోకేశ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారనే ప్రచారం ముమ్మరమైంది. ఇప్పటి వరకు ఆయన తెర వెనకే ఉంటూ వచ్చారు. ఇక ముందు తండ్రి వారసునిగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొనే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆదివారం నాటి అవినీతి వ్యతిరేక ర్యాలీలో లోకేష్ ఆద్యంతం చురుగ్గా పాల్గొనడంతో పార్టీ వర్గాల్లో ఆసక్తి మొదలైంది. ఈ ర్యాలీ రాజకీయాలకు అతీతమని చంద్రబాబు ముందే ప్రకటించారు. గతం లో ఇలాంటి ఏ కార్యక్రమాల్లోనూ పాల్గొనని లోకేష్ ఆదివారం తెరముందుకు రావడం ఆసక్తి కలిగిస్తోంది. లోకేష్ కొద్ది కాలంగా హెరిటేజ్ బాధ్యతలకే పరిమితమవుతూ వచ్చారు. తన తండ్రి నియోజకవర్గమైన కుప్పం వ్యవహారాలను మాత్రం అప్పుడప్పుడు పట్టించుకునేవారు.

ఎన్నికల సమయంలో పార్టీ శ్రేణుల సమన్వయానికే ఆయన పాత్ర పరిమితమయ్యేది. రైతు సమస్యల పరిష్కారానికి కొద్దిరోజుల కిందట చంద్రబాబు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష వేదికపై లోకేష్ బహిరంగంగా కనిపించారు. తండ్రి అరెస్టును తీవ్రంగా ప్రతిఘటించారు. అంతకుమించి రాజకీయాల్లో ఆయన జోక్యం చేసుకోలేదు. లోకేష్‌ను రాజకీయాల్లోకి తీసుకు రావాల్సిందిగా నాలుగేళ్ల కిందట ఓ నాయకుడు ప్రస్తావించినప్పుడు చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. తన పనేదో తాను చూసుకుంటున్నాడు కదా..ఇప్పుడు రాజకీయాలెందుకని అన్నారు. అయితే, పరిస్థితి మారడంతో లోకేష్ కూడా రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X