హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పరిటాల హత్యపై చంద్రబాబు ఆరోపణలకు జగన్ సాక్షి డైలీ కౌంటర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sakshi Daily
హైదరాబాద్: పరిటాల రవి హత్య విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలకు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి డైలీ కౌంటర్ ఇచ్చింది. చంద్రబాబుపై ఎదురుదాడికి దిగింది. సూట్‌కేసు బాంబు కేసులో మంగలి కృష్ణ వాంగ్మూలం ఓ రిపోర్టర్ రాసిందని, అది బూటకం కాబట్టే చెత్త బుట్టదాఖలు చేశారని ఆ వార్తాకథనం చెప్పింది. ఆధారాలుంటే జగన్‌ను అరెస్టు చేయవచ్చు కదా అని సవాల్ చేసింది. ఈ మేరకు సాక్షి దినపత్రికలో ఓ వార్తాకథనం ప్రచురితమైంది. ఫ్యాక్షన్ బాబు యాక్షన్ డ్రామా అనే పతాక శీర్షికపై ఆ వార్తాకథనాన్ని సాక్షి డైలీ ప్రచురించింది. చంద్రబాబు 9 ఏళ్ల ప్రభుత్వంలో 965 హత్యలు జరిగాయని వ్యాఖ్యానించింది. కాంగ్రెసు, ఎల్లో మీడియా (ఈనాడు, ఆంధ్రజ్యోతి)లతో కలిసి తెలుగుదేశం పార్టీ నాటకం ఆడుతోందని వ్యాఖ్యానించింది. అధికార పార్టీ అండతోనే ఇవన్నీ సాగాయని జస్టిస్ రంగరాజు నివేదిక అభిప్రాయపడినట్లు తెలిపింది.

ఫాక్షనిజాన్ని పెంచి పోషించిన చంద్రబాబు తన తండ్రి హంతకులను కూడా వదిలేసిన వైయస్ రాజశేఖర రెడ్డిపై, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డిపై నిసిగ్గుగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది. పరిటాల రవి హత్యను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ముడిపెట్టే దారుణానికి చంద్రబాబు దిగారని, అందుకోసం ఏకంగా రాజకీయ ప్రత్యర్థయిన కాంగ్రెస్ అధిష్టానంతోనూ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితోనూ చేతులు కలిపారని సాక్షి డైలీ వ్యాఖ్యానించింది. నక్సలైట్ ఉద్యమం నుంచి ఫ్యాక్షన్ బాట పట్టిన పరిటాల రవీంద్రపై పలు హత్యారోపణలున్నాయి. పెనుకొండ మాజీ ఎమ్మెల్యేలు ఓబుల్‌రెడ్డి, సానె చెన్నారెడ్డి, సానె వెంకట రమణారెడ్డి హత్యలతో పాటు అనేక దాడులు, హింసాత్మక సంఘటనల్లో పరిటాల రవికి ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారని వ్యాఖ్యానించింది. పరిటాల, మద్దెలచెర్వు కుటుంబాల మధ్య తరతరాలుగా ఉన్న పగలు, ప్రతీకారాలను కూడా రాజకీయాలకు ముడిపెట్టారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X