హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉండవల్లిపై భగ్గుమన్న వైయస్ జగన్ క్యాంప్ నేత అంబటి రాంబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీని చేర్చుకోవాలని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అధిష్టానానికి లేఖ రాశారంటూ ఆ లేఖను బయట పెట్టిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్‌పై మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకుడు అంబటి రాంబాబు భగ్గుమన్నారు. ఆనాటి పరిస్థితిలో చిరంజీవిని చేర్చుకోవడం అవసరమని వైయస్ భావించి ఉండవచ్చునని, ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా అని ఆయన అన్నారు. కాంగ్రెసులో ప్రజారాజ్యం విలీనమవుతుందా, కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుంటుందా అనేది తమకు అవసరం లేని విషయమని, అయితే నైతికమైన అంశంగా మాత్రమే తాను ప్రశ్నిస్తున్నానని, కాంగ్రెసు మునిగిపోయిన పడవ అని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైయస్ హయాంలో కాంగ్రెసు పార్టీ బలహీనపడలేదని, తన అంచనాకు తగిన విధంగా ఓట్లు రాలేదని మాత్రమే వైయస్ భావించేవారని ఆయన అన్నారు.

వైయస్ నేరుగా లేఖలను అధిష్టానానికి పంపేవారని, ఆ లేఖ గురించి ఉండవల్లికి తెలిసే అవకాశం లేదని, ఉండవల్లి వెనక ఎవరో ఉండి ఆ పనిచేయించారని ఆయన అన్నారు. వైయస్ కుటుంబాన్ని ఒంటరి చేయడానికి ప్రయత్నిస్తున్న నీచమైన ఎత్తుగడలో ఉండవల్లి పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ రాసినట్లు చెబుతున్న లేఖపై ఉండవల్లి వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు. వైయసే తమకు అధిష్టానంగా ఉండేవారని ఆయన అన్నారు. వైయస్‌కు అత్యంత సన్నిహితుడైన ఉండవల్లి నీచమైన ఎత్తుగడలో ఎందుకు పాలు పంచుకుంటున్నారని అడుగుతున్నానని ఆయన అన్నారు. వైయస్ ఉన్నప్పుడే ప్రజారాజ్యం గురించి చెప్పారు కాబట్టి చేస్తున్నామంటున్నవారు కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడిన రోజా విషయంలో ఎందుకు సానుకూలంగా వ్యవహరించలేదని ఆయన అడిగారు.

జగన్‌ను అణచివేయడానికి చిరంజీవితో దోస్తీ కడుతున్నారని ఆయన విమర్సించారు. వైయస్ దయ వల్లనే తాను, ఉండవల్లి ఇలా ఉన్నామని, కాంగ్రెసు నీచమైన ఎత్తుగడలో ఉండవల్లి పాలు పంచుకోవడం బాధాకరంగా ఉందని ఆయన అన్నారు. వైయస్‌ను అవినీతి చక్రవర్తి అన్నప్పుడు ఖండించడానికి ఉండవల్లి ఎందుకు ముందుకు రాలేదని ఆయన అడిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X