కాంగ్రెసుతో బంధంపై ఎటూ తేల్చుకోలేకపోతున్న చిరంజీవి

Chiranjeevi
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీతో బంధంపై ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఒక రకంగా ఆయన గందరగోళంలో ఉన్నారనే చెప్పాలి. రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీ వచ్చి ఢిల్లీకి ఆహ్వానించినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాలు చిరంజీవి చుట్టే తిరుగుతున్నాయి. రాష్ట్ర రాజకీయాలకు ఆయన కేంద్ర బిందువుగా మారారు. పార్టీని తమ పార్టీలో విలీనం చేయాలని కాంగ్రెసు పెద్దలు చిరంజీవిని అడుగుతున్నట్లు తెలుస్తోంది. విలీనం చేస్తే చిరంజీవికి ఘనమైన ఆఫర్లను చిరంజీవికి కాంగ్రెసు పెద్దలు ఇచ్చినట్లు సమాచారం. రాజ్యసభ సీటు ఇచ్చి, కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం అందులో ఒకటని, కొంత కాలం తర్వాత పిసిసి అధ్యక్ష పదవి అప్పగించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తేవడం రెండోదని చెబుతున్నారు.

కాంగ్రెసు ఇస్తున్న ఆఫర్లు చిరంజీవి ఊరిస్తున్నాయి. అయితే, కాంగ్రెసు పెద్దలను నమ్మడానికి వీలుందా, పార్టీని విలీనం చేస్తే తన స్వతంత్రతను కోల్పోయి మరొకరి చేతి మీద బతకాల్సి వస్తుందా అనేది ఆయనను పీడిస్తోందని అంటున్నారు. చిరంజీవి నెంబర్ వన్‌గా ఉండాలని, అలా ఉండాలంటే పొత్తు పెట్టకోకూడదని ప్రజారాజ్యం పార్టీ నాయకులు అంటున్నారు. పార్టీని నడపడం చిరంజీవికి కష్టంగానే ఉన్నట్లు చెబుతున్నారు. దాంతో ఆయన విలీనం వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, విలీనానికి కొంత సమయం తీసుకోవచ్చునని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+