ఆదివారమే కాంగ్రెసు పార్టీలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ విలీనం

విలీనం నిర్ణయం తీసుకునే బాధ్యతను శాసనసభ్యులు చిరంజీవికి అప్పగిస్తారని అంటున్నారు. ఆ వెంటనే శాసనసభ్యులతో కలిసి చిరంజీవి సోనియాను కలుస్తారని, విలీనంపై చిరంజీవి అధికారికంగా ప్రకటించిన తన శాసనసభ్యులతో కలిసి సోనియాతో గ్రూప్ ఫొటో దిగుతారని అంటున్నారు. విలీనానికి ఇప్పటికే ఆంటోనీ హైదరాబాదు వచ్చినప్పుడే ఓ ఒప్పందం కుదిరిందని అంటున్నారు. ఈ ఒప్పందం ప్రకారం శాసనసభ్యులకు మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు ప్రజారాజ్యం పార్టీలో ఉన్నవారిని కొంత మందిని శాసనమండలికి ఎంపిక చేయాలి. ఈ విలీనంతో బొటాబొటి మెజారిటీ నడుస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బలం చేకూరుతుంది.












Click it and Unblock the Notifications