జగన్‌ను అటాక్ చేస్తా, సోనియావల్లే వైయస్ చాప్టర్ ఓపెన్: ఉండవల్లి

Undavalli Arun Kumar
న్యూఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ముఖ్యమంత్రిని చేశారని కాంగ్రెసు పార్టీ రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ బుధవారం అన్నారు. వైయస్‌ను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసింది సోనియానే అని స్పష్టం చేశారు. వైయస్ నేషనల్ ఫిగర్‌గా మారడానికి కారణం సోనియా అన్నారు. వైయస్ నన్ను చాలా ప్రోత్సాహించారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం 2014 వరకు ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఎవరికీ అసంతృప్తి లేదన్నారు. వైయస్ ఎప్పుడూ సోనియాకు, కాంగ్రెసు‌కు వ్యతిరేకం కాదన్నారు. వైయస్ మనుషులమని చెప్పి సోనియాను తిట్టేవారు వైయస్ అనుచరులు కాదన్నారు.

వైయస్ చేసిన ప్రతి పని కాంగ్రెసు అధిష్టానం అనుమతితోనే జరిగిందన్నారు. వైయస్‌కు కాంగ్రెసు పార్టీ ఎంతో చేసిందన్నారు. మరీ ముఖ్యంగా సోనియాగాంధీ ఎంతో చేసిందన్నారు. సోనియా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వైయస్‌కుగానీ, తనకు గానీ రాజకీయ చాప్టర్ ఓపెన్ అయ్యిందన్నారు. లేదంటే మా చాప్టర్ క్లోజ్ అయ్యేదన్నారు. వైయస్‌కు ఇంత చేసిన సోనియాను తిట్టడం వైయస్ అనుచరులు ఎవరూ చేయరన్నారు. 1981 నుండి వైయస్ తో పరిచయం ఉందన్నారు. జగన్ సోనియాను ఏమీ అనలేదని, అయితే ఆయన చుట్టుపక్కల ఉన్నవారు మాత్రం మాట్లాడుతున్నారన్నారు. వైయస్ పేరుతో పార్టీ పెట్టుకుంటూ ఆయన ఇష్టాలకు వ్యతిరేకంగా నడవడం సరికాదన్నారు. అది సరికాదన్నారు. జగన్ సోనియాపై మాట్లాడినప్పుడు నేను అటాక్ చేస్తానని చెప్పారు.

అయితే జగన్ ప్రధాని మన్మోహన్ పైనే వ్యాఖ్యలు చేశారని అయితే సోనియాను ఏమీ అనలేదన్నారు. మన్మోహన్ కూడా తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ఆరోపణలు మాత్రమే చేశారన్నారు. వైయస్‌కు అత్యంత సన్నిహితుడు అయిన కెవిపిని బ్రోకర్ అనడం కన్నా తీవ్రమైన వ్యాఖ్యలు మరేమీ లేవన్నారు. జగన్ పార్టీ ఇంకా పెట్టలేదని చెప్పారు. కాంగ్రెసు‌తో సమైక్యావాది అయిన చిరంజీవి పొత్తుపై ప్రశ్నించినప్పుడు పార్లమెంటు సమావేశాల్లో సమైక్యాంధ్ర ఫ్లకార్డు పట్టుకున్న జగన్‌తో తెలంగాణవాదులు లేరా అని ప్రశ్నించారు. పార్టీలు వేరైనా సిద్ధాంతాలు ఎవరివీ వాళ్లకే ఉంటాయన్నారు. జగన్ దయాదాక్షిణ్యాలపై కాంగ్రెసు ప్రభుత్వం లేదన్నారు. అలాంటి అవసరం కూడా లేదన్నారు. 2014 వరకు కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం కొనసాగుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+