చిరంజీవి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి

ఉత్తర తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రచ్చబండను తెలంగాణవాదులు అడ్డుకోవద్దని మంత్రి కోరారు. రేపటి బందును తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ ఇవ్వకపోతే మంత్రులు కఠిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ప్రభుత్వం కార్యక్రమం రచ్చబండ వద్ద తెలంగాణ ప్రజల్లోని ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష బయటపడిందన్నారు. దానిని అధిష్టానం ఖచ్చితంగా గుర్తిస్తుందన్నారు. రచ్చబండ కార్యక్రమంలో తెలంగాణవాదుల నిరసనలతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. పోలీసుల చర్యలు మమ్మల్ని ఎంతగానో బాధిస్తున్నాయన్నారు.
కాగా చిరంజీవి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి మద్దతు తెలపాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి వేరుగా విలేకరులతో అన్నారు. వరలక్ష్మి మృతిపై అరోపణలు సరికాదన్నారు. గోద్రా సంఘటనలో నరేంద్రమోడి హస్తం ఉందని సిట్ తెలిపినందున ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications