సోనియాతో భేటీ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటాం: చిరంజీవి

నిజానికి ఈ నెల 7వ తేదీన సోనియా గాంధీతో తాను సమావేశం కావాల్సి ఉందని, అయితే కొన్ని ఇతర కారణాల వల్ల ముందే భేటీ ఖరారైందని ఆయన చెప్పారు. రెండు పార్టీలు బలోపేతం అయ్యే అవకాశం ఉండే విధంగా దోస్తీ ఉంటుందని ఆయన చెప్పారు. సోనియాతో భేటీ తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తానని ఆయన చెప్పారు. ఆయన ఢిల్లీకి వెళ్లిన వెంటనే సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌తో భేటీ అవుతారు. ఆదివారం ఉదయం 11 గంటలకు సోనియాతో సమావేశమవుతారు. తిరిగి అహ్మద్ పటేల్‌తోనూ ఇతర కాంగ్రెసు అధిష్టానం నేతలతోనూ సమావేశమవుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తారు.












Click it and Unblock the Notifications